Ramachari singer biography paper
కోమండూరి రామాచారి
కోమండూరి రామాచారి, ఒక ప్రముఖ సంగీత అధ్యాపకుడు, గాయకుడు, సంగీత దర్శకుడు. హైదరాబాదులో అతను నిర్వహిస్తున్న లిటిల్ మ్యుజీషియన్స్ అకాడమీ (ఎల్. ఎం. ఎ) ద్వారా ఎంతోమంది పిల్లలు సంగీతం నేర్చుకుని సినిమా రంగంలో ప్రవేశించారు. హేమచంద్ర, కారుణ్య లాంటి గాయకులు రామాచారి వద్ద సంగీతం నేర్చుకున్న వారే.[2]ఈటీవీలో ప్రసారమయ్యే ప్రముఖ పాటల కార్యక్రమం పాడుతా తీయగా మొట్టమొదటి సంచికలో ఇతను ద్వితీయ విజేతగా నిలిచాడు. 2016లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారం అందుకున్నాడు.[3]
విశేషాలు
[మార్చు]ఇతను మెదక్ జిల్లా, శివంపేట మండలం, పెద్దగొట్టిముక్కల గ్రామంలో పుట్టాడు. ఇతని తండ్రి కోమండూరి కృష్ణమాచారి పురోహితుడు.తండ్రి కృష్ణమాచారికి సంగీతంలో ప్రవేశం ఉంది. హరికథలు చెప్పేవాడు. తల్లి యశోదమ్మ మంగళహారతులు పాటలు శ్రావ్యంగా పాడేది.[4] రామాచారికి సంగీతం పట్ల మక్కువ ఇతని తల్లిదండ్రుల వల్ల కలిగింది. రామాచారి ప్రాథమిక విద్య స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. ఇంటర్మీడియట్ మేడ్చల్ లో చదువుకున్నాడు. ఇతను పదవ తరగతి చదివే సమయంలోనే సంగీతం నేర